Kishan Reddy Alampur Visit | అలంపూర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ పర్యటన ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kishan Reddy Alampur Visit | కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ పర్యటన ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన సోమవారం అలంపూర్ క్షేత్రాన్ని సందర్శించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం అలంపూర్‌లోని ప్రసిద్ధ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వినాయక పూజ అనంతరం స్వామివారికి కిషన్ రెడ్డి అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మొక్క నాటిన ఆయనకు, అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అలంపూర్ చారిత్రక ప్రాధాన్యతను ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు.

Kishan Reddy Alampur Visit | వినతిపత్రాల స్వీకరణ..

ఆలయ దర్శనం ముగించుకుని హరిత హోటల్‌కు చేరుకున్న కిషన్ రెడ్డిని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న ఆయన, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Kishan Reddy Alampur Visit | పర్యటన ముగింపు..

జోగులాంబ రైల్వే స్టేషన్ పరిశీలనకు బయలుదేరే ముందు కేంద్ర మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ గౌతమి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో పురంధర్, అదనపు కలెక్టర్ మధుమోహన్, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *