HPV Vaccination Target | హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: HPV Vaccination Target | హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా అన్నారు. పట్టణంలోని యూపీహెచ్‌సీ (UPHC), పీఎస్ నగర్‌ను సందర్శించి వైద్య సేవలను, రిజిస్టర్లు, వివిధ రికార్డులను తనిఖీ చేశారు.

HPV Vaccination Target | రికార్డుల పరిశీలన..

ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని రిజిస్టర్లు, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై తల్లిదండ్రులకు, పిల్లలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన బాలికలకు వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిరిసిల్ల (Siricilla)లోని అమృత చిల్డ్రన్ హాస్పిటల్ను సందర్శించి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ (Clinical Establishments Act), 2010 ప్రకారం ఆసుపత్రిలోని వైద్య సేవలు, రికార్డులు, ఇతర నిర్వహణ అంశాలను పరిశీలించారు.

HPV Vaccination Target | మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి..

ఈ సందర్భంగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 2010లో పొందుపర్చిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.ప్రభుత్వం నిర్దేశించిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాహితి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Voter Rights Protection | అర్హులు ఓటు హక్కు కోల్పోవద్దు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *