Traffic Violation Insurance | మోటార్ ఇన్సూరెన్స్ కొత్త రూల్స్.. చలాన్ల రికార్డుతో ప్రీమియం అనుసంధానం..

ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు పడితే జరిమానాతో పాటు వాహన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరిగే అవకాశం ఉంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Traffic Violation Insurance | ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు  (  Challans )పడితే జరిమానాతో పాటు వాహన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది కాలంలో వాహనంపై నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, చలాన్ల రికార్డును మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంతో అనుసంధానించే కొత్త విధానంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే తరచూ నిబంధనలు అతిక్రమించే బైక్, కారు యజమానులు పాలసీ రెన్యూవల్ సమయంలో సాధారణం కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు కొన్ని ప్రత్యేక కేటగిరీల బేస్ ఇన్సూరెన్స్ రేట్లను కూడా సవరించే ఆలోచనలో కేంద్రం ఉంది.

Traffic Violation Insurance | ఇన్సూరెన్స్ లేదు..

దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల యాక్టివ్ వాహనాలు ఉండగా, వాటిలో 81 శాతం వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. కార్లలో 88 శాతం, భారీ వాహనాల్లో 90 శాతానికి పైగా కవరేజ్ ఉండగా, బైకుల్లో 80 శాతం వాహనాలకే ఇన్సూరెన్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన 19 శాతం వాహనాలను కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి కావడంతో కేంద్రం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

Traffic Violation Insurance | ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’..

ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించి నియంత్రించేందుకు ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయించకుండా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రవాణా, పెట్రోలియం శాఖలకు సూచనలు అందాయి.

Traffic Violation Insurance | మల్టీ-ఇయర్ పాలసీలపై దృష్టి..

వాహనదారుల సౌలభ్యం కోసం కార్లకు 4 ఏళ్లు, బైకులకు 6 ఏళ్ల కాలపరిమితితో ఒకేసారి ప్రీమియం చెల్లించే మల్టీ-ఇయర్ పాలసీలను తీసుకురావడంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చలానాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలోనూ ఖర్చు పెరిగే అవకాశం ఉందని వాహనదారులు గమనించాలి.

ఇది కూడా చదవండి: Paddy Procurement Delay | ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడో..? కేంద్రాల జాడలేక డీలాపడ్డ రైతన్న

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *