అక్షరటుడే వెబ్‌డెస్క్: Electric Truck Awareness | దేశంలో ఎలక్ట్రిక్ రవాణా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రముఖ కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ ‘అశోక్ లీల్యాండ్’, ఐఐటీ మద్రాస్‌తో కలిసి కీలక అడుగు వేసింది. ఐఐటీ మద్రాస్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జీరో ఎమిషన్ ట్రకింగ్’ (CoEZET) సహకారంతో చెన్నై వేదికగా ‘గెట్ జెట్’ (GET ZET – Electric Truck Awareness to Acceptance) పేరుతో దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు దేశంలోని 40 ప్రధాన నగరాల్లో ఈ ప్రచార యాత్ర కొనసాగనుంది. రవాణా రంగంలో కాలుష్య రహిత (జీరో-ఎమిషన్) పరిష్కారాలపై ప్రజల్లో, వ్యాపారుల్లో నమ్మకం కలిగించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.
Electric Truck Awareness | 40 నగరాల్లో పర్యటన..
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ( Telangana ) , ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కీలక లాజిస్టిక్స్ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లలో ఈ యాత్ర సాగుతుంది. ఫ్లీట్ ఓనర్లు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు, ఫైనాన్షియర్లు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఎలక్ట్రిక్ ట్రక్కుల వాడకంపై చర్చిస్తారు. అశోక్ లీల్యాండ్కు చెందిన లేటెస్ట్ ‘బాస్ ఎలక్ట్రిక్ ట్రక్’ (BOSS Electric Truck), ఛార్జర్ సెటప్‌ను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. పాల్గొనేవారు ఎలక్ట్రిక్ ట్రక్కులను స్వయంగా పరిశీలించి, వాటి పనితీరును అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు.
Electric Truck Awareness | నిర్వాహకుల మాటలు..
అశోక్ లీల్యాండ్ ఎండీ & సీఈఓ షేను అగర్వాల్ మాట్లాడుతూ.. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, వినియోగదారుల్లో నమ్మకం కలిగినప్పుడే మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో 40 నగరాలకు ఎలక్ట్రిక్ ట్రక్కులను తీసుకెళ్లి, వాటి నిజమైన సామర్థ్యాన్ని కస్టమర్లకు చూపిస్తామని తెలిపారు.
ఐఐటీ మద్రాస్ డీన్ ప్రొఫెసర్ మను సంతానం మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 నాటికి 100% జీరో-ఎమిషన్ ట్రక్కుల సాధనే లక్ష్యంగా CoEZET పనిచేస్తోందని చెప్పారు. డ్రైవర్ల సందేహాలను నివృత్తి చేస్తూ, ఎలక్ట్రిక్ ట్రక్కులపై నమ్మకాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Flydubai Flight | పైలట్‌ను కత్తితో పొడిచిన కోపైలెట్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్