Flydubai Flight | పైలట్​ను కత్తితో పొడిచిన కోపైలెట్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flydubai Flight | ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు పైలట్ల మధ్య గొడవ కారణంగా విమానాన్ని దారి మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్​ చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్‌కు ఫ్లైదుబాయ్ ఫ్లైట్ FZ1073 బయలుదేరిన కొద్దిసేపటికి గందరగోళం చేటుచేసుకుంది. టేకాఫ్​ తర్వాత అత్యవసర కోడ్​, అనంతరం హైజాక్​ కోడ్​ ప్రసారం అయింది. దీంతో ఉగ్రవాద కోణం ఉందని అధికారులు అనుమానించారు. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. అయితే ఆ విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్​ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Flydubai Flight | అధికారుల క్లారిటీ..

ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారులు తమ అంచనాను మార్చుకున్నారు. ఇద్దరు పైలట్ల మధ్య ‘తీవ్ర ఘర్షణ’ జరిగిన తర్వాత విమానాన్ని దారి మళ్లించినట్లు తెలిపారు. సుమారు 180 మంది ప్రయాణికులతో ఉన్న విమానంలో కో-పైలట్, పైలట్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. అనంతరం రెండవ పైలట్ల బృందం, బుధవారం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసింది.

Flydubai Flight | ప్రయాణికులు సురక్షితం

పైలట్ల మధ్య ఘర్షణతో విమానం ఒక్కసారిగా 17,400 అడుగుల మేర కిందికి దిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం దానిని దారి మళ్లించి సౌదీలో సురక్షితంగా ల్యాండ్​ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్, కో-పైలట్ ఇద్దరూ గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పరిస్థితి “అదుపులో ఉంది” అని పేర్కొంది. పైలట్​ తీవ్ర గాయాలతో ఉన్న విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని ప్రయాణికులు పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Kisan Mela 2026 | రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *