అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi Controversy | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ (BJP) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మహిళలను అవమానించారని మండిపడ్డారు.
ఇండోర్‌లో శనివారం నిర్వహించిన ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో మోదీ (PM Modi)ని అనుకరిస్తూ.. ఒక స్టాండప్ కమెడియన్‌తో రాహుల్ స్కిట్ చేయించారు. ఇందులో ప్రధానిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. సదరు స్టాండప్ కమెడియన్ నవ్వుతూ మోదీని అవమానించేలా ప్రవర్తించగా.. రాహుల్ గాంధీ సైతం ఆయనను ప్రోత్సహించారు. ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై పలువురు బీజేపీ నాయకులు ఆదివారం స్పందించారు.
Rahul Gandhi Controversy | తల్లిని ఎగతాళి చేశారు
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కేశవన్ మాట్లాడుతూ ఒక తల్లిని ఎగతాళి చేయడం ద్వారా రాహుల్ మహిళలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆలోచించే ఏ వ్యక్తి కూడా ఈ అసభ్యకరమైన, నాసిరకమైన చేష్టలను చూసి నవ్వరని, కానీ రాహుల్ వారితో కలిసి ఉన్న వేదికపై బిగ్గరగా నవ్వుతూ కనిపించారన్నారు. ఇలాంటి చర్యలతోనే ఆయన యువతను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ వైఫల్యాన్ని కాంగ్రెస్ సొంత నాయకుడు శశి థరూర్ కూడా అంగీకరించారని గుర్తు చేశారు.
Rahul Gandhi Controversy | అందుకే ఓడిపోయారు
రాహుల్ గాంధీ ద్వేషపూరిత రాజకీయాల వల్లే ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఓడిపోయిందని కేశవన్ అన్నారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ నైతిక దివాలాలో పాతాళానికి దిగజారారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడి భాష మరింత అధ్వాన్నంగా దిగజారుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
#WATCH | Indore, Madhya Pradesh: At the ‘Chhatron Ki Goonj’ programme in Indore, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, “…The ‘andhbhakt’ says development is not needed. Modi ji is an incarnation of Vishnu. But the andhbhakt never asks questions. An andhbhakt will… pic.twitter.com/0Xa5b70O8h
— ANI (@ANI) September 19, 2026
దీనిని కూడా చదవండి : Telangana DCC Presidents Appointed | తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు.. ఆ జిల్లాలకు కొత్త అధ్యక్షులు!