Rain Forecast | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Forecast | తెలంగాణలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సైతం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి వాన దంచికొట్టింది. వనపర్తి, గద్వాల, మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నేడు రాత్రి సైతం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రంగారెడ్డి, మహబూబ్​నగర్​, వనపర్తి, నాగర్​కర్నూల్​, గద్వాల, నారాయణపేట, వికారాబాద్​, నల్గొండ, సంగారెడ్డి, భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్​, మెదక్ (Medak)​, సిద్దిపేట జిల్లాల్లో రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అయితే ఈ వర్షాలు విస్తారంగా కాకుండా అక్కడక్కడే పడుతాయని అధికారులు తెలిపారు.

Rain Forecast | అల్పపీడన ప్రభావంతో..

సెప్టెంబర్ 23న ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాన్ని బలమైన అల్పపీడనం (LPA), వాయుగుండం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 23 నుండి 25 మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది.

దీనిని కూడా చదవండి : Home Loan Tips | హోమ్​​లోన్​ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *