అక్షరటుడే, వెబ్డెస్క్: Save Democracy March | ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక తీర్మానాలు చేసింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రసీ మార్చ్ పేరిట ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.
కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బుధవారం నాడు ఒక ప్రకటన చేశారు. ఎన్నికల సంఘం పనితీరుపై ఇటీవల వెలువడిన నివేదికల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల ఎంపీలందరూ అక్టోబర్ 6న ఎన్నికల సంఘం కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తారని తెలిపారు. అంతేగాకుండా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.
Save Democracy March | రాష్ట్రపతిని కలుస్తాం..
అక్టోబర్ 2వ వారంలో రాష్ట్రపతిని కలుస్తామని ఖర్గే తెలిపారు. ఈసీని నరేంద్ర మోడీ, అమిత్ షా తోలుబొమ్మలా వాడుతున్నారని ఆరోపించారు. అందుకే ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2 నుండి 8 వరకు డీఎం కార్యాలయాల వద్ద ఇండియా బ్లాక్ సభ్యులు నిరసనలు చేపడతారన్నారు. ఐదు ర్యాలీలకు ప్రణాళికలు సిద్ధం చేశామని, తేదీలను ఖరారు చేస్తున్నామని ఆయన తెలిపారు. నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Vietnam Accident | యోగా నేర్పడానికి వెళ్లి.. వియత్నాంలో ఇద్దరు భారతీయుల మృతి