అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minimum Wages GO 6 | రాష్ట్ర ప్రభుత్వం తీసకొచ్చిన కనీస వేతనాలు జీవో నంబర్.6ను అమలు చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహిచారు.
Minimum Wages GO 6 | మూడు కేటగిరీలుగా వేతనాలు ప్రకటించి..
ఈ సందర్భంగా టీయుసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలో మూడు కేటగిరీలుగా కనీస వేతనాలను ప్రకటించారన్నారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వం జూన్ 1న గెజిట్ విడుదల చేసిందన్నారు. కోటిమంది కార్మికులు ఈ జీవో ద్వారా లబ్ధి పొందుతారని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ ఆచరణలో ఇది అమలు కావడం లేదని ఆరోపించారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్, మిషన్ భగీరథ, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఆశ, అంగన్వాడీల్లో ఇప్పటికీ ఈ జీవో అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి పెరుగుతున్న ధరలకు ఇస్తున్న వేతనాలకు పొంతనలేదని, జీవో 6 ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు కూడా సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, సహాయ కార్యదర్శిలు బి.మల్లేష్, డి.కిషన్ కోశాధికారి సాయరెడ్డి, జిల్లా నాయకులు మురళి, రాజేశ్వర్, రవి, లింగం, తారాచంద్, సుమలత, రాధా, సుమ, పద్మ, లింగం, గంగాధర్, రాజన్న, ప్రభాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Student Bus Protest | బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు