Student Bus Protest | బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

బస్సుల కోసం విద్యార్థులు రోడ్కెక్కారు. ఈ ఘటన బోధన్​ నియోజకవర్గంలోని సాలూర మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Student Bus Protest | బస్సుల కోసం విద్యార్థులు రోడ్కెక్కారు. ఈ ఘటన బోధన్​ (Bodhan) నియోజకవర్గంలోని సాలూర మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

Student Bus Protest | ఖాజాపూర్​ వద్ద..

సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామం వద్ద బుధవారం విద్యార్థులు ఆర్టీసీ బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. సుంకిని నుంచి సాలూరు మీదుగా వెళ్లే బస్సులు సరిపడా లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. నిత్యం కళాశాలలు, పాఠశాలలు లేటుగా వెళ్లాల్సి వస్తోందన్నారు. బస్సు ముందు కూర్చొని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న బోధన్ రూరల్  ఎస్సై రాజశేఖర్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. డీఎంతో మాట్లాడి అదనపు బస్సు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

ఇది కూడా చదవండి..: Oil Palm Factory | ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు మరింత ప్రయోజనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *