Power Cuts | కరెంట్​ కోతలతో ఎండుతున్న పంటలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడ కరెంట్ ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Power Cuts | రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడ కరెంట్ ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్​ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా (Nalgonda District)లోని చిన్న మందారం గ్రామంలో పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. రాంచందర్​రావు మాట్లాడుతూ.. జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. రైతులకు అవసరమైన విద్యుత్‌, సాగునీటిని సమృద్ధిగా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవడంతో వరి పంటలు ఎండిపోయాయన్నారు.. అన్నదాతల దుస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చింత కనిపించడం లేదని విమర్శించారు.

Power Cuts | కాంగ్రెస్​ విఫలం

రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. ఎల్​నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ముందే తెలిసినా, వ్యవసాయాన్ని కాపాడేందుకు, తగినంత నీరు, విద్యుత్ సరఫరా ఉండేలా కనీస ముందస్తు ఏర్పాట్లు కూడా చేయలేదని విమర్శించారు. అనంతరం ఆయన చిన్న మేడారం సబ్‌స్టేషన్‌ను సందర్శించి, విద్యుత్ సరఫరా లాగ్‌బుక్‌ను పరిశీలించాను. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రోజుకు కేవలం 4–5 గంటల మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. ఈ తీవ్రమైన విద్యుత్ కొరత కారణంగా రైతులు బోర్లను నడపలేక, సాగుకు అవసరమైన భూగర్భ జలాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Milk Powder Smuggling | పిల్లల పాలపొడిని వదలని అక్రమార్కులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *