అక్షరటుడే, వెబ్‌డెస్క్: Archery Gold Medal | ఆర్చరీలో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం మూడు బంగారు పతకాలు గెలుచుకొని హ్యాట్రిక్ సాధించారు. మహిళ టీమ్, మిక్స్డ్ టీమ్, పురుషుల టీమ్ ఈవెంట్లలో భారత్ విజయం సాధించింది.
ఆసియా క్రీడల్లో (Asian Games) 11వ రోజు భారత ఆర్చరీ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్స్ సాధించారు. కాంపౌండ్ ఆర్చరీలో మూడు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. కాంపౌండ్ పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. సాహిల్ జాదవ్ చివరి మూడు షాట్ల సెట్‌ను 10 స్కోరుతో ప్రారంభించాడు. గణేష్ మణిరత్నం కూడా 10 సాధించాడు. కుశాల్ కూడా 10 సాధించడంతో భారత్ 30/30 స్కోరు చేసింది. చైనా 30 పాయింట్లతో ప్రదర్శన చేసినప్పటికీ, అది భారత్‌ను అధిగమించడానికి సరిపోలేదు. స్కోరును పరిశీలించిన తర్వాత భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుందని అధికారులు ప్రకటించారు.
Archery Gold Medal | మూడు పతకాలతో..
ఆర్చరీలో బుధవారం ఉదయం మహిళల జట్టు చైనా ఓడించి బంగారు పతకం గెలుచుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సైతం స్వర్ణం గెలుచుకుని, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలకు ప్రతిష్టాత్మకమైన కోటా స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా పురుషుల టీమ్ సైతం గెలుపొందడంతో భారత పతకాల సంఖ్య 58కి చేరింది. ఇందులో 10 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. తాజా పతకాలతో భారత్ పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరింది.
ఇది కూడా చదవండి..: Mixed Trap Shooting | మిక్స్డ్ ట్రాప్ షూటింగ్లో భారత్‌కు గోల్డ్ మెడల్