Mixed Trap Shooting | మిక్స్​డ్​ ట్రాప్​ షూటింగ్​లో భారత్​కు గోల్డ్ మెడల్​

ఆసియా క్రీడల్లో భాగంగా మిక్స్​డ్​ ట్రాప్​ షూటింగ్​లో భారత జట్టు పసిడి పతకం గెలుచుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mixed Trap Shooting | ఆసియా క్రీడల్లో (Asian Games) బుధవారం భారత్​ హవా కొనసాగుతోంది. ఏకంగా మూడు స్వర్ణ పతకాలను సాధించింది. అంతేగాకుండా పలు విభాగాల్లో ఫైనల్​కు చేరి కనీసం రజత పతకాలను భారత క్రీడాకారులు ఖాయం చేసుకున్నారు.

షూటింగ్ ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో నీరూ ధండా, కైనాన్ చెనై అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించారు. మొదట్లో లక్ష్యాలను చేధించలేకపోయిన ఈ జంట.. తర్వాత పుంజుకుంది. కొట్టిన ప్రతి షాట్‌ను విజయవంతంగా ఛేదించి ఒక్క పాయింట్ తేడాతో ఖతార్‌ను ఓడించింది. నీరూ దండా మంగళవారం వ్యక్తిగత విభాగంలో గోల్డ్​ మెడల్​, మహిళల టీమ్​ ఈవెంట్​లో సిల్వర్​ మెడల్​ సాధించింది. తాజాగా మిక్స్​డ్​ టీమ్​ ఈవెంట్​లో గోల్డ్​ మెడల్​తో ఆకట్టుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఆమె 3 పతకాలు సాధించడం గమనార్హం. భారత మిక్స్​డ్​ టీమ్​ మొత్తం 34 పాయింట్లతో ఆసియా రికార్డును కూడా నెలకొల్పింది.

Mixed Trap Shooting | బాక్సింగ్​లో కాంస్యం

బాక్సింగ్​ 60 కేజీల సెమీ-ఫైనల్‌లో భారత క్రీడాకారిని ప్రియా ఘంగాస్ ఓడిపోయింది. దీంతో ఆమెకు కాంస్యం దక్కింది. మరోవైపు లవ్లీనా బోర్గోహైన్ సెమీస్​లో గెలుపొంది 75 కేజీల ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఫైనల్​లో గెలిస్తే గోల్డ్​, ఓడితే సిల్వర్​ మెడల్​ దక్కనుంది. తన్వి ఖన్నా, అనాహత్ సింగ్‌ల మహిళల స్క్వాష్ జట్టు సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లి మరో పతకాన్ని ఖాయం చేసుకుంది.

ఇది కూడా చదవండి..: Asian Games Archery | భారత్​ గురి అదిరింది.. ఆర్చరీలో రెండు బంగారు పతకాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *