Ram Charan Bumrah Comment | బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్​చరణ్​.. ఎందుకో తెలుసా?

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ram Charan Bumrah Comment | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi movie) ప్రమోషన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ (Bhopal)లో నిర్వహించిన ‘పెద్ది’ లైవ్ ఈవెంట్ అభిమానుల నుంచి భారీ స్పందనను దక్కించుకుంది. అయితే ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

జస్‌ప్రీత్ బుమ్రాపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో పాటు ట్రోలింగ్‌కు కూడా కారణమయ్యాయి. ఈవెంట్‌లో భాగంగా యాంకర్, భారత స్టార్ క్రికెటర్ల పేర్లు చెబుతూ వారి గురించి ఒక్క మాటలో స్పందించాలని రామ్ చరణ్‌ను కోరారు. మొదట సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతూ ఆయనను “లెజెండరీ”గా అభివర్ణించారు. మహేంద్ర సింగ్ ధోనిని “కామ్ అండ్ కూల్”, రోహిత్ శర్మను “అందరి ప్రేమ పొందిన వ్యక్తి”, విరాట్ కోహ్లీని “ఫైర్” అంటూ ప్రశంసించారు.

Ram Charan Bumrah Comment | మ‌ళ్లీ దొరికేశాడు..

అయితే జస్‌ప్రీత్ బుమ్రా Bumrah పేరు చెప్పగానే రామ్ చరణ్ అనుకోకుండా పొరపాటు చేశారు. “నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. ఫుట్‌బాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఆటను మీరు మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. లవ్ యూ” అంటూ వ్యాఖ్యానించారు. భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాను ఫుట్‌బాల్‌కు అనుసంధానం చేయడం అక్కడున్న వారితో పాటు సోషల్ మీడియా వినియోగదారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ వీడియో క్లిప్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “బుమ్రా ఎప్పటి నుంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యాడు?”, “టీమిండియా పేసర్‌ను ఫుట్‌బాల్ స్టార్‌గా మార్చేశారు” అంటూ నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేశారు. కొందరు సరదాగా ఐపీఎల్ ప్రదర్శనతో దీనిని లింక్ చేస్తూ కామెంట్లు కూడా చేశారు.

Ram Charan Bumrah Comment | క్షమాపణ చెప్పన రామ్​చరణ్​

ఈ వివాదం పెద్దది కాకముందే రామ్ చరణ్ (Ram Charan Bumrah Comment) స్పందించారు. ఈవెంట్ ముగిసిన వెంటనే తన అధికారిక సోషల్ మీడియా వేదిక ద్వారా బుమ్రాకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేశారు. కొన్నిసార్లు నేను పేర్లు మిక్స్ చేస్తుంటాను. అంత పెద్ద జనసందోహం, ఎగ్జైట్‌మెంట్ మధ్యలో జరిగిన మానవ తప్పిదం అది. బుమ్రా.. మీపై నాకు ఎంతో గౌరవం ఉంది. మీ ఆటకు నేను అభిమానిని” అంటూ రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈ ఘటనతో మరోసారి రామ్ చరణ్‌కు పేర్లు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయనే విషయం చర్చకు వచ్చింది.

గతంలో ‘ఆర్ఆర్ఆర్’ RRR ప్రమోషన్ల సమయంలో కూడా ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి ఇంటర్వ్యూలో చరణ్ పేర్లు గుర్తుపెట్టుకోవడంలో కొంచెం వీక్ అని సరదాగా ప్రస్తావించారు. ఇదిలా ఉంటే భోపాల్ ఈవెంట్‌లో మరోసారి చిన్న పొరపాటు చోటుచేసుకుంది. భోపాల్ అని చెప్పాల్సిన చోట ఒక సందర్భంలో పొరపాటున బీహార్ అని రామ్ చరణ్ సంబోధించారు. అయితే వెంటనే యాంకర్ దాన్ని సరిచేశారు.మొత్తానికి చిన్న పొరపాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసినప్పటికీ, రామ్ చరణ్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్, క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

దీనిని కూడా చదవండి : Prabhas Ormax Ranking | పాపులారిటీలో ప్రభాస్ దూకుడు.. వరుసగా నాలుగోసారి నంబర్-1 స్థానం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *