Prabhas Ormax Ranking | పాపులారిటీలో ప్రభాస్ దూకుడు.. వరుసగా నాలుగోసారి నంబర్-1 స్థానం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Prabhas Ormax Ranking | భారతీయ సినీ పరిశ్రమ (Film Industry)లో స్టార్ హీరోల ప్రజాదరణ రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల ప్రభావం పెరిగిన తర్వాత ప్రాంతీయ భాషల హీరోలు కూడా దేశవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్ర‌భాస్ (Rebel Star Prabhas) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ మేల్ స్టార్స్ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. విశేషం ఏమిటంటే ఇది ఒక్కసారి సాధించిన ఘనత కాదు. వరుసగా నాలుగోసారి ఆయన నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Prabhas Ormax Ranking | టాప్‌లో ప్ర‌భాస్..

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన భారీ ప్రాజెక్టులతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఇటీవల పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ దేశవ్యాప్తంగా అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈసారి విడుదలైన టాప్-10 జాబితాలో టాలీవుడ్ హీరోల ప్రభావం స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ (Allu Arjun) మూడో స్థానాన్ని దక్కించుకోగా, మ‌హేష్ బాబు ఐదో స్థానంలో నిలిచారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

Prabhas Ormax Ranking | “రాజంటే రెబల్.. రెబల్ అంటే రాజే”

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ (Junior NTR) కూడా టాప్-10లో స్థానం సంపాదించి టాలీవుడ్ సత్తాను మరోసారి చాటారు. మొత్తం టాప్-10లో ఐదు స్థానాలు తెలుగు హీరోలకే దక్కడం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ర్యాంకింగ్స్ బయటకు వచ్చిన తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “రాజంటే రెబల్.. రెబల్ అంటే రాజే” అంటూ ప్రభాస్ అభిమానులు పోస్టులు చేస్తుండగా, తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత బలపడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: AP FDC ఛైర్మన్​గా భరత్ భూషణ్.. వైస్ ఛైర్మన్​గా మెహర్ రమేష్.. డైరెక్టర్లుగా మరో 14 మంది నియామకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *