Ustaad Bhagat Singh in OTT | థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ నిరాశే.. ఉస్తాద్ భగత్ సింగ్‌కి నెగెటివ్ రెస్పాన్స్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ustaad Bhagat Singh in OTT | ఉగాది సందర్భంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్  సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ఈ చిత్రం ఏ దశలోనూ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద త్వరగానే రన్‌ను ముగించుకుంది.

ఈ క్ర‌మంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఆయన కెరీర్‌లోనే ఒక పెద్ద ఫ్లాప్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది. అయితే డిజిటల్ విడుదల తర్వాత కూడా పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Ustaad Bhagat Singh in OTT

Ustaad Bhagat Singh in OTT | ఓటీటీలోను నిరాశే..

దర్శకుడు హరీష్ శంకర్ (Director Harish Shankar) ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపినా, ఆయన గత చిత్రాల్లో కనిపించిన మేజిక్ ఇందులో కనిపించలేదని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కథలో బలం లేకపోవడం, అనవసర బిల్డప్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్లపై అధిక దృష్టి పెట్టడం సినిమాకు మైనస్‌లుగా మారినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్‌పై తీసిన ఎలివేషన్ షాట్లు మాత్రమే కొంతవరకు ఆకట్టుకున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నప్పటికీ, అవి మొత్తం సినిమాను నిలబెట్టే స్థాయిలో లేవని అంటున్నారు. ఫలితంగా, ఈ చిత్రం రీసెంట్ టైంలో పూర్తిగా నిరాకరించబడిన సినిమాల జాబితాలో చేరిపోయిందని ట్రేడ్ టాక్.

Ustaad Bhagat Singh in OTT | పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి

పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. మెయిన్ గా ఈ సినిమా ప్రస్తుతం 10కి పైగానే దేశాల్లో టాప్ 10 లో ట్రెండింగ్ లో కొనసాగుతుందట. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇతర హీరోల అభిమానులతో పాటు, పవన్ కళ్యాణ్ అభిమానులే దర్శకుడు హరీష్ శంకర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మొత్తంగా, బాక్స్ ఆఫీస్ నుంచి ఓటీటీ వరకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రయాణం నిరాశజనకంగానే ముగిసిందని చెప్పాలి.

ఇది కూడా చదవండి..: Ananya Nagalla | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై అనన్య నాగళ్ల స్పందన.. “డబ్బు కాదు, కమ్యూనిటీ కోసం”

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *