Heavy Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rain Alert | రాష్ట్రంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. గాలివాన బీభత్సం సృష్టించడంతో రైతులు నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన పంట నేలవాలింది. నేడు సైతం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు.

హీట్​వేవ్​ కారణంగా రాష్ట్రంలో ఇటీవల ఎండలు దంచికొట్టాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే ఆదివారం కురిసిన వానతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగా ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వాన పడింది. పలుచోట్ల వడగళ్లు కురిశాయి. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

Heavy Rain Alert

Heavy Rain Alert | ఆ జిల్లాలకు అలెర్ట్​

రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమవారం సాయంత్రం సైతం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో వాన పడుతుంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి – భువనగిరి, మేడ్చల్, జనగాం, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, గద్వాల్, వనపర్తి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సైతంఅక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Visit | రేపు భూపాలపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *