సినిమాPawan Kalyan Sinus Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జ‌రిగిన శ‌స్త్ర చికిత్స‌పై వ‌చ్చిన క్లారిటీ.....

Pawan Kalyan Sinus Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జ‌రిగిన శ‌స్త్ర చికిత్స‌పై వ‌చ్చిన క్లారిటీ.. తిరుమ‌ల‌కి వెళ్లిన‌ప్పుడే బ‌య‌ట‌ప‌డిందా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సైనసైటిస్ సమస్య కారణంగా ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan Sinus Surgery | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital)లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయనకు శనివారం శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉండి కోలుకుంటున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్‌కు దీర్ఘకాలంగా సైనస్ సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వైద్యులు ఆయనకు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (Functional Endoscopic Sinus Surgery) నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను సాధారణంగా సైనసైటిస్, పాలిప్స్ వంటి సమస్యలు మందులతో తగ్గకపోతే చేస్తారు. ఎండోస్కోప్ సహాయంతో సైనస్ మార్గాల్లో అడ్డంకిగా ఉన్న వాపు, పాలిప్స్‌ను తొలగించడం ద్వారా శ్వాస సమస్యలను తగ్గించడం ఈ సర్జరీ లక్ష్యం.

Pawan Kalyan Sinus Surgery | వైద్యుల సూచనలు

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు వెల్లడించారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి కనీసం వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ సమయంలో ముక్కును ఊదకూడదని, బరువైన పనులు చేయకూడదని, శ్వాస సంబంధిత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగిన విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra babu naidu), మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సహా సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

Pawan Kalyan Sinus Surgery | సైనస్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు

పవన్ కళ్యాణ్‌కు గత కొంతకాలంగా సైనస్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. గతంలో తిరుమల పాదయాత్ర సమయంలో కూడా ఆయన అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన అనుసరిస్తున్న దీక్షలు, కఠినమైన ఆహార నియమాలు కూడా శారీరకంగా ప్రభావం చూపినట్లుగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఈ పరిణామాలతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వైద్యులు ఆందోళన అవసరం లేదని, సరైన విశ్రాంతితో త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని స్పష్టం చేశారు. ఏదేమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు ఊరట పొందుతున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ తిరిగి తన రాజకీయ, పరిపాలనా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి..: Prakash Raj Controversy | ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై వివాదం.. నా మాట‌ల‌ని వ‌క్రీక‌రించారంటూ విల‌క్ష‌ణ న‌టుడు వివ‌ర‌ణ‌

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...