Illegal Water Motors | నల్లాలకు బిగించిన మోటార్లు స్వాధీనం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal Water Motors | హైదరాబాద్​ నగరంలో నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగిస్తున్న వారిపై జలమండలి అధికారులు (Water Board Officers) కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక డ్రైవ్​ చేపడుతూ.. మోటార్లు స్వాధీనం చేసుకున్నారు.

వేసవి నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad)​లో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతమంది నల్లాలకు అక్రమంగా మోటార్లు పెట్టి అధికంగా నీటిని వాడుకుంటున్నారు. ఫలితంగా కొన్ని బస్తీలకు నీరు అందడం లేదు. వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై జలమండలికి ఇటీవల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో అధికారులు చర్చలు చేపడుతున్నారు.

Illegal Water Motors | రామాంతాపూర్​లో..

జలమండలి అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు చేశారు. జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లు సీజ్ చేశారు. ఉప్పల్ జోన్ రామంతపూర్ సెక్షన్ (Ramanthapur Section) పరిధిలోని ఎండోమెంట్ కాలనీలో నల్లాకు బిగించిన మోటార్లును విజిలెన్సు అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.

Illegal Water Motors | కఠిన చర్యలు

వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామన్నారు. నల్లాకు మోటార్లు బిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తక్కువ ప్రెజర్​తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. ప్రజలు తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలని సూచించారు. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Rains | హైదరాబాద్​లో వర్షం.. పలుచోట్ల వడగళ్ల వాన..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *