Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రైం

క్రైంహైదరాబాద్

Nepal Gang Arrested | గచ్చిబౌలి చోరీ కేసు.. నేపాల్​ గ్యాంగ్ అరెస్ట్

గచ్చిబౌలిలో ఉన్న 'హిల్ రిడ్జ్ విల్లాస్'లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

Srinivas Kolluri
Last updated: June 11, 2026, 8:40 pm 8:40 pm
Srinivas Kolluri
Share
Nepal Gang Arrested

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Gang Arrested | హైదరాబాద్‌ (Hyderabad)లోని గచ్చిబౌలిలో ఉన్న ‘హిల్ రిడ్జ్ విల్లాస్’లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠాను సైబరాబాద్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. నిందితుల  నుంచి సుమారు 8 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

గచ్చిబౌలి (Gachibowli)లోని ‘హిల్ రిడ్జ్ విల్లాస్’లో ఉన్న ఒక విల్లాలో ఈ నెల 6న చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంటి యజమానులు లేని సమయంలో నేపాలీ దంపతులు చోరీకి పాల్పడ్డారు. ఆ విల్లాలో నివసిస్తున్న వృద్ధ దంపతులు జూన్​ 7న సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఒక చిన్న విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసు కనిపించకపోవడాన్ని గమనించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

gold 1

Nepal Gang Arrested | లాకర్​లో బంగారం మాయం

ఆ దంపతుల కుమారుడు ఈ నెల 8న ఇంటికి వచ్చి తన వద్ద ఉన్న తాళం చెవితో లాకర్‌ను తెరిచాడు. లాకర్ నుండి సుమారు 7–8 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆపరేషన్స్ టీమ్ (SOT), క్రైమ్ బృందాలు, స్థానిక పోలీసులను రంగంలోకి దించారు. లభించిన ఆధారాల మేరకు నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు.

Nepal Gang Arrested | యూపీలో..

nepal gang

గచ్చిబౌలి పోలీస్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఆయన బృందం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా బిలాస్‌పూర్ రోడ్డు వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన మొత్తం సొత్తును నష్టం లేకుండా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నేపాల్​కు చెందిన కమల్ షాహి (32), ఆయన భార్యా విమల షాహి అలియాస్ బిమల షాహి, కల్పన షాహి (26)గా గుర్తించారు.

Nepal Gang Arrested | పని మనిషులుగా చేరి..

ఈ కేసులో ప్రధాన నిందితుడు నేపాల్​కు చెందిన సురేష్​ అలియాస్​ సూరజ్​ పరారీలో ఉన్నాడు. ఇతడు విలాసవంతమైన విల్లాలలో నివసించే ఉన్నత వృత్తి నిపుణులను లక్ష్యంగా చేసుకుని, వారి ఇళ్లలోకి పనివాళ్లను చేర్పిస్తాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అవకాశం తీసుకుని, ఇంటి తలుపులు, లాకర్లు పగలగొట్టి బంగారం, నగదు ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తాడు.

దీనిని కూడా చదవండి : Khammam Theft | ఖమ్మంలో భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు

 

TAGGED:Crime News IndiaCyberabad policeGachibowli Theft Casegold theftHyderabad crimeNepal Gang ArrestedTelangana crimeVilla Burglary
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Crop Diversification Crop Diversification | పంట మార్పిడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా : టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత
Next Article Minister Ponguleti Minister Ponguleti | తహశీల్దార్​, సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Illegal Water Motors
హైదరాబాద్

 Illegal Water Motors | నల్లాలకు బిగించిన మోటార్లు స్వాధీనం

By Srinivas Kolluri
Hidden Treasure |
క్రైంనిజామాబాద్

Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు..! నగరంలో కలకలం రేపిన ఘటన..

By Shashi kiran Mottala
Wedding Clash Attack
నిజామాబాద్క్రైం

Wedding Clash Attack | తెల్లారితే పెళ్లి.. ఇరువర్గాల గొడవ.. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి

By Balla Sandeep Kumar
Kapra Cylinder Blast
హైదరాబాద్

Kapra Cylinder Blast | సిలిండర్ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.