Minister Ponguleti | తహశీల్దార్​, సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహశీల్దార్, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. ఈ భ‌వ‌నాల‌ను హౌసింగ్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో నిర్మించాల‌ని నిర్ణయించిన‌ట్లు వెల్లడించారు.

సచివాలయంలో గురువారం రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని తహశీల్దార్, ఆర్డీవో, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిధిలావ‌స్థ, పాల‌న‌కు అనువుగా లేని భ‌వ‌నాలు వివ‌రాలను సేకరించారు. మొద‌టి ద‌శ‌లో అద్దె భావనాలల్లో, శిథిలావస్థాలో ఉన్న 125 తహశీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.

Minister Ponguleti | మరమ్మతులు చేపడుతాం

అవ‌స‌ర‌మైన చోట్ల మ‌ర‌మ్మతులు చేప‌ట్టడానికి నివేదిక‌లు అందించాల‌ని రెవెన్యూ సెక్రెట‌రీని మంత్రి ఆదేశించారు. భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించి నిర్మాణ పనులు వీలైనత త్వరితగతిన ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Crop Diversification | పంట మార్పిడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా : టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *