Footpath Encroachments | హైదరాబాద్​ నగరంలో ఫుట్​పాత్​ల ఆక్రమణలు తొలగింపు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Footpath Encroachments | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఫుట్​పాత్​ల ఆక్రమణల తొలగింపు కోసం జీహెచ్​ఎంసీ అధికారులు (GHMC Officers) ప్రత్యేక డ్రైవ్​ చేపడుతున్నారు. ప్రతి శనివారం ఆక్రమణలను తొలగిస్తున్నారు.

నగరంలో చాలా ప్రాంతాల్లో ఫుట్​పాత్​లు ఆక్రమణలకు గురైన విషయం తెలిసిందే. వాటిపై పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దుకాణదారులు, షాపింగ్​ మళ్ల నిర్వాహకులు సైతం ఫుట్​పాత్​లను ఆక్రమించారు. దీంతో ప్రజలు రోడ్లపై నడుస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్​తో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.. రోడ్లపై పాదచారులు నడవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఫుట్​పాత్​లపై ఏర్పాటు చేసిన షెడ్లు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు.

Footpath Encroachments | ఎస్​ఆర్​ నగర్​లో..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు తాజాగా ఎస్ఆర్ నగర్‌లో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించారు. పాదచారుల రాకపోకలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ఫుట్‌పాత్‌లను క్లియర్ చేయడంపై ఈ ఆపరేషన్ దృష్టి సారించింది. పోలీసుల సహకారంతో అధికారులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇలాంటి చర్యలు ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

footpath 1

ఇది కూడా చదవండి..: Gachibowli Stadium | రూపురేఖలు మారనున్న గచ్చిబౌలి స్టేడియం.. PPP విధానంలో అభివృద్ధికి నిర్ణయం!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *