Kavitha | తెలంగాణ ‘అమ్మ’గా కవిత.. మరో జయలలిత పుట్టుకొస్తుందా?

Balla Sandeep Kumar

అక్షరటుడే, హైదరాబాద్: Kavitha | తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సరికొత్త సమీకరణాలకు తెరలేపారు. కొత్త పార్టీ ఆవిర్భావ సభ సాక్షిగా ఆమె తన రాజకీయ శైలిని పూర్తిగా మార్చేశారు.

ఈ సభలో కవిత తనను తాను పదేపదే ‘అమ్మ’గా ప్రమోట్ చేసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. “తెలంగాణ (Telangana)లోని మూడు కోట్ల ప్రజలకు ఒక తల్లిలా రక్షణగా ఉంటాను.. కష్టాల్లో తోడుంటాను” అని ఆమె ఇచ్చిన భరోసా కేవలం ఒక హామీ మాత్రమే కాదు, ఆమె భవిష్యత్తు రాజకీయ గమనాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Kavitha | ఈ ‘అమ్మ’ బాట వెనుక పొరుగు రాష్ట్రం..

కవిత ఎంచుకున్న ఈ ‘అమ్మ’ బాట వెనుక పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయ చరిత్ర కనిపిస్తోంది. నాడు తమిళ రాజకీయాల్లో పురుషాధిక్యం రాజ్యమేలుతున్న సమయంలో, వాటన్నింటినీ ఎదురించి జె.జయలలిత ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. కోట్లాది మంది ప్రజలతో ‘అమ్మ’ అని పిలిపించుకుంటూ దశాబ్దాల పాటు చక్రం తిప్పారు. జయలలిత (Jayalalithaa) ఎలాగైతే మహిళా సంక్షేమ పథకాలు, ప్రజలకు భద్రత అనే అంశాలతో ‘అమ్మ’గా ఇమేజ్ సాధించారు.

సొంత పార్టీలో లేదా ప్రత్యర్థి పార్టీల్లో పురుష నేతల ఆధిపత్యాన్ని తట్టుకుని నిలబడటానికి ‘అమ్మ’ అనే ఎమోషనల్ అస్త్రాన్ని ఆమె సంధించారు. ఇప్పటివరకు ‘కేసీఆర్ కూతురు’ అనే గుర్తింపు ఉన్న కవిత, ఇప్పుడు ‘ప్రజల అమ్మ’ అనే కొత్త ట్యాగ్‌తో తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి తనకంటూ సొంత ఇమేజ్​ను నిర్మించుకోవాలని చూస్తున్నారు.

Kavitha | శక్తివంతమైన ఆయుధంగా..

తెలంగాణలోని మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘అమ్మ’ అనే పదం ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుందని కవిత నమ్ముతున్నారు. “అమ్మలా అండగా ఉంటా” అని చెప్పడం ద్వారా సామాన్య ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ చర్చ..

ద్రవిడ రాజకీయాల్లో జయలలిత సృష్టించిన ప్రభంజనాన్ని కవిత తెలంగాణలో పునరావృతం చేయగలరా? అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఒకవైపు అన్న కేటీఆర్, మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి సవాళ్లు ఉన్న తరుణంలో.. కవిత ఎంచుకున్న ఈ ‘అమ్మ’ సెంటిమెంట్ ఆమెను మరో జయలలితగా నిలబెడుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి..: Footpath Encroachments | హైదరాబాద్​ నగరంలో ఫుట్​పాత్​ల ఆక్రమణలు తొలగింపు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *