అక్షరటుడే వెబ్‌డెస్క్: Pune Lawyer Assault | పూణేలో ఒక మహిళా న్యాయవాదిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘోర ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పాట్నాకు చెందిన బాధితురాలు పూణేలో ఎల్‌ఎల్‌బీ చదివి, ప్రస్తుతం ముంబై హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వృత్తిపరమైన పనిమీద పూణేకు వచ్చిన ఆమెకు ఎదురైన ఈ దారుణ అనుభవం స్థానికంగా కలకలం రేపింది.
Pune Lawyer Assault l హోటల్‌లో పరిచయం
గత ఆదివారం పూణేలో ఉన్న బాధితురాలు, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తిని కలవడానికి కోరేగావ్ పార్క్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం వేళ ఆ వ్యక్తి తనతో పాటు మరో ఇద్దరు మహిళలను తీసుకుని అక్కడకు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ ముగ్గురూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే హోటల్‌లో ఆమె మద్యం సేవిస్తున్న సమయంలో, పక్క టేబుల్‌లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులతో ఆమెకు మాటలు కలిశాయి. అనంతరం వారంతా కలిసి ఒక పబ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Pune Lawyer Assault l కారులో పైశాచికత్వం..
అందరూ కలిసి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే నిందితుల అసలు స్వరూపం బయటపడింది. ప్రయాణంలో ఉండగానే నిందితుల్లో ఒకడు కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా, నిందితులు తమ మరికొంతమంది స్నేహితులకు స్పీకర్‌ఫోన్‌లో కాల్ చేసి, సదరు మహిళపై అత్యంత అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఆ సమయంలో కారులో ఉన్న మిగిలిన వారు కూడా వికృత శబ్దాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారని దర్యాప్తులో తేలింది.
Pune Lawyer Assault | బాధితురాలి ఫిర్యాదు..
ఈ ఘోరం జరిగిన తర్వాత బాధితురాలు ఎలాగోలా ఒక స్థానికుడి సహాయంతో తన స్నేహితుడిని సంప్రదించారు. అనంతరం వారిద్దరూ కలిసి కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ ఘాతుకంపై పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ స్పందిస్తూ.. తాము ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న నాల్గవ నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Warangal Congress Unity | వరంగల్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. ఒక్కటైన నేతలు


