Bank Five Day Week | బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత 

బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bank Five Day Week | బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత  ( Kavitha ) డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఈ డిమాండ్ పూర్తిగా న్యాయబద్ధమైనదేనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక పనిభారంతో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐదు రోజుల పనిదినాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక వీడియోను విడుదల చేశారు.

Bank Five Day Week | కరెన్సీ లెక్కలతోనే..

ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లతో గడపడమే కాకుండా, బ్యాక్-ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంతోనే ఉద్యోగుల రోజంతా గడిచిపోతుందని కవిత చెప్పారు. చాలామంది సాధారణ ప్రజలు బ్యాంక్ వేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు పనేం ఉండదనుకుంటారని, కానీ బిజినెస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 9, 10 గంటల వరకు వారు బ్యాంకుల్లోనే పనిచేయాల్సి వస్తోందని ఆమె వివరించారు.

Bank Five Day Week | షిఫ్ట్ విధానం తీసుకురండి..

గత పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు భారీగా పెరగడంతో పాటు ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో బ్రాంచ్‌లకు వచ్చే ఖాతాదారుల సంఖ్య తగ్గిందని కవిత గుర్తుచేశారు. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల పనిభారం మాత్రం ఎక్కడా తగ్గలేదన్నారు. ఒకవేళ ఐదు రోజుల పని విధానం సాధ్యం కాకపోతే.. బ్యాంకులు వారానికి 7 రోజులు నడిచేలా ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకు ‘షిఫ్ట్ విధానం’ తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రెండు శనివారాల సెలవుల వల్ల ఎక్కడా ఉత్పాదకత (ప్రొడక్టివిటీ) తగ్గలేదని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి:  Rahul Gandhi Protest | ఢిల్లీలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన రాహుల్​ గాంధీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *