అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Protest | ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండి కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం వరకు ర్యాలీగా బయలు దేరారు.
ఎంపీల ర్యాలీతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) వరకు భారీగా బలగాలను మోహరించారు. సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే మార్గాలను మూసివేశారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. ఎంపీలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైటెన్షన్ నెలకొంది.
Rahul Gandhi Protest | ర్యాలీకి దూరంగా ఆప్
ఎన్నికల కమిషనర్‌ను తప్పించాలని ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఎన్నికల సంఘం, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇండి కూటమి ర్యాలీ చేపట్టింది. అయితే ఈ ర్యాలీకి డీఎంకే (DMK), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దూరంగా ఉండటం గమనార్హం. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీలు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Chinese Crackers Seized | చెన్నై పోర్టులో భారీగా టపాసులు సీజ్