అక్షరటుడే, వెబ్డెస్క్ : Voter Registration | ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్వ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయిన రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొంది.
ఎన్నికల సంఘం (Election Commission) దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఎస్ఐఆర్తో లక్షలాది ఓట్లు తొలగించారు. మరణించిన వారితో పాటు డబుల్ ఓట్లు, సరైన పత్రాలు లేనివారి ఓటు హక్కును తొలగించారు. ఈ క్రమంలో పలువురు అర్హుల ఓట్లు కూడా తొలగించారని విపక్షాలు విమర్శిస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాబితాలో చోటు దక్కని అర్హులైన ఓటర్లతో పాటు యువకులు, మొదటిసారి ఓటు వేయనున్న వారిని నమోదు చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించింది.
Voter Registration | 13 కోట్ల పేర్లు తొలగింపు
ఎస్ఐఆర్తో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి సుమారు 13 కోట్ల పేర్లను తొలగించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈసీ తాజా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అయితే జాబితా నుంచి తొలగించిన వారు అందరూ అర్హులు కాదని ఈసీ స్పష్టం చేసింది. అర్హులకు అన్యాయం జరగకుండా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొంది. అన్ని అర్హతలు ఉన్నా ఎస్ఐఆర్ జాబితాలో పేరు రాకపోతే నిరంతర అప్డేషన్ ప్రక్రియ కింద తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి సంబంధిత ఈఆర్వోలకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: Abhijeet Dipke Detained | చాయ్ తాగుదాం రండి.. అభిజీత్ దీప్కే అరెస్ట్ వెనుక బిగ్ ట్విస్ట్?