Abhijeet Dipke Detained | చాయ్ తాగుదాం రండి.. అభిజీత్ దీప్కే అరెస్ట్ వెనుక బిగ్ ట్విస్ట్?

గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు ముంబైలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Abhijeet Dipke Detained | గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు ముంబైలో ( Mumbai ) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వైవిధ్యమైన నిరసనకు పిలుపునిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను గురువారం సాయంత్రం మెరైన్ డ్రైవ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయన్ను విడుదల చేశారు.

Abhijeet Dipke Detained | అసలేం జరిగింది?

మద్దతుదారులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని మెరైన్ డ్రైవ్ వద్ద నిరసన తెలుపుతున్న అభిజీత్ వద్దకు ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం చేరుకుంది. ఆయన్ను పోలీస్ వ్యాన్‌ ఎక్కించి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆ మహిళా అధికారి ఆయన వివరాలు, సొంతూరు గురించి ఆరా తీశారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసుల వాదన మరోలా ఉంది. తాము అభిజీత్‌ను ఎలాంటి అరెస్ట్ చేయలేదని, నిర్బంధించలేదని స్పష్టం చేశారు. సాయంత్రం వేళ ప్రజలను కలుస్తూ, విధుల్లో ఉన్న పోలీసులను రకరకాల ప్రశ్నలు అడుగుతుండటంతో మాట్లాడేందుకే స్టేషన్‌కు పిలిచామని అధికారులు తెలిపారు.

Abhijeet Dipke Detained | అభిజీత్ విమర్శలు..

మరోవైపు పోలీసుల వెర్షన్‌ను అభిజీత్ దిప్కే తీవ్రంగా ఖండించారు. ఆ మహిళా పోలీస్ అధికారి తన దగ్గరకు వచ్చి “పదండి.. ఒక టీ తాగుదాం, మీకు మా వద్ద ‘చాయ్’ బాకీ ఉంది” అని చెప్పి మరీ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు. కానీ, తీరా స్టేషన్‌కు వెళ్లాక టీ ఇవ్వకపోగా, కేవలం తన విలువైన సమయాన్ని వృథా చేయడానికే పోలీసులు అలా చేశారని ఆరోపించారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్లే తనను ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక చెంబూరులోని అంబేడ్కర్ హాస్టల్‌లో విద్యార్థులతో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Abhijeet Dipke Detained | నిరసనకు అనుమతి నిరాకరణ..

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ప్రముఖ శివాజీ పార్క్ వద్ద జనం గుమికూడేందుకు అనుమతి లేకపోవడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతుందనే కారణాలతో ముంబై పోలీసులు ఈ నిరసన కార్యక్రమానికి ముందే అనుమతి నిరాకరించారు.

ఇది కూడా చదవండి:  Pilot Smith Machar | పైలట్ స్మిత్ మచ్చర్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *