Gandhi Jayanti Nizamabad | మహనీయులు చూపిన బాటలో నడవాలి.. మేయర్​ ఉమారాణి

మహనీయులు చూపిన బాటలో నడవాలని మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Gandhi Jayanti Nizamabad | మహనీయులు చూపిన బాటలో నడవాలని మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. గాంధీ జయంతి, లాల్​ బహదూర్​ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం నగరం (Nizamabad)లోని గాంధీచౌక్​లో మహాత్ముడి, లాల్​బహదూర్​ శాస్త్రి విగ్రహాలకు మేయర్​తో పాటు అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ నివాళులర్పించారు.

Gandhi Jayanti Nizamabad | వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి

వారు మాట్లాడుతూ.. జాతినేతలు దేశానికి చేసిన సేవలు అమోఘమన్నారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Farmers Power Protest | విద్యుత్ సబ్ స్టేషన్​ను ముట్టడించిన రైతులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *