Farmers Power Protest | విద్యుత్ సబ్ స్టేషన్​ను ముట్టడించిన రైతులు

అస్తవ్యస్త కరెంట్​ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, పెద్దకొడప్​గల్​ : Farmers Power Protest | కరెంట్​ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెద్దకొడప్​గల్​ మండలంలోని కాటేపల్లి విద్యుత్​ సబ్​స్టేషన్​ను శుక్రవారం ముట్టడించారు.

Farmers Power Protest | ఇష్టారాజ్యంగా విద్యుత్​ సరఫరా..!

Farmers Power Protest

ఒక రోజులో రెండు గంటలు కూడా విద్యుత్​ సరఫరా సరిగ్గా ఉండడం లేదని రైతులు (Farmers) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లుగా కోతలు విధిస్తుండడంతో పొలాల్లో నీళ్లు పారట్లేదని వారు వాపోయారు. ఎన్నిసార్లు విద్యుత్​ శాఖ అధికారులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సబ్​స్టేషన్​ను ముట్టడించినట్లు వారు పేర్కొన్నారు. సబ్​స్టేషన్​ పరిధిలో ఒక లైన్​మన్​ను నియమించాలని డిమాండ్​ చేశారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తాము సబ్​స్టేషన్​ వద్ద నుంచి కదిలేది లేదని వారు భీష్మించారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Lal Bahadur Shastri | లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *