అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mahishasura Mardini | నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. తొమ్మిదో రోజులో భాగంగా సోమవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అత్యంత శక్తివంతమైన రుద్రరూపంలో దుర్గాదేవి (Durga Devi)ని భక్తులు శ్రద్ధతో పూజిస్తున్నారు.
Mahishasura Mardini | చైతన్య యూత్ ఆధ్వర్యంలో..
చైతన్య యూత్, హిందూ యువ సేన ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ నవమిని పురస్కరించుకుని సోమవారం భక్తులు , అర్చకులు జగన్మాతకు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భవాని స్వాములు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి..: Bathukamma Celebrations | ఖండాంతరాలు దాటిన బతుకమ్మ వైభవం.. సెయింట్ లూయిస్‌లో ఘనంగా సంబరం