Meta Fake News Advisory | ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌లను మార్చాల్సిందే: కేంద్రం

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నకిలీ సమాచారం (Fake News) వ్యాప్తి చెందకుండా, ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Meta Fake News Advisory | ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నకిలీ సమాచారం (Fake News) వ్యాప్తి చెందకుండా, ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) సంస్థకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) అధికారికంగా ఒక పటిష్టమైన అడ్వైజరీని జారీ చేసింది. ప్లాట్‌ఫారమ్‌లలోని సిఫార్సు వ్యవస్థలు (Recommendation Systems), కంటెంట్-ర్యాంకింగ్ అల్గారిథమ్‌ల పనితీరును తక్షణమే పునఃపరిశీలించాలని స్పష్టం చేసింది.

Meta Fake News Advisory | ప్రచారంపై ఆంక్షలు..

వినియోగదారులకు కేవలం ఒకే రకమైన లేదా పరిమితమైన అభిప్రాయాలు/కథనాలు మాత్రమే విపరీతంగా కనిపించేలా (Disproportionate Exposure) రికమండేషన్ సిస్టమ్స్ పనిచేయకూడదని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. సమాచారంలో విశ్వసనీయతతో పాటు తగిన వైవిధ్యం ఉండేలా చూడాలని సూచించింది.

పాత వీడియోలు, సంబంధం లేని దృశ్యాలు, ఎడిట్ చేసిన ఫొటోలను ప్రస్తుత సంఘటనలుగా చూపిస్తూ ప్రజలను భ్రాంతికి గురిచేసే కంటెంట్‌ను అల్గారిథమ్‌ల ద్వారా ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, ప్రజల్లో ఆందోళన, హింసను ప్రేరేపించే కంటెంట్‌ను త్వరితగతిన గుర్తించి నిరోధించేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మెటాను కోరింది.

Meta Fake News Advisory | పూర్తి సహకారం..

ఐటీ నిబంధనలు-2021 (IT Rules, 2021) ప్రకారం.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు నిర్దేశిత వ్యవధిలో అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు చట్టపరమైన విచారణల్లో పూర్తి సహకారం అందించాలని మెటాకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ అడ్వైజరీని తక్షణమే అమలు చేసి, తీసుకున్న చర్యలపై మంత్రిత్వ శాఖకు తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి:  Mahishasura Mardini | మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన జగన్మాత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *