అక్షరటుడే, గాంధారి: Saddula Bathukamma Festival | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. అయితే ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది గాంధారిలో సద్దుల బతుకమ్మ సంబరాన్ని ఒకరోజు లేటుగా సోమవారం నిర్వహించడం చర్చనీయాంశమైంది.
Saddula Bathukamma Festival | సంప్రదాయామా.. వ్యాపార ప్రయోజనమా..?
ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరం ఆదివారం పూర్తయ్యింది. కాని గాంధారి మండల (Gandhari Mandal) కేంద్రంలో మాత్రం ఆదివారం సంత కావడంతో బతుకమ్మ పండుగను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ప్రజల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎక్కడా.. ఎన్నడూ లేని విధంగా ఇలా రోజులు మార్చి బతుకమ్మ పండుగలు నిర్వహించడం ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
Saddula Bathukamma Festival | వ్యాపార ప్రయోజనాల కోసమే..
ఒకరోజు ఆలస్యంగా సద్దుల బతుకమ్మం నిర్వహించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఆదివారం సంత రోజు బతుకమ్మ నిర్వహిస్తే తమ వ్యాపారంలో లాభాలు తగ్గుతాయని భావించిన వ్యాపారులే ఇలా ఒకరోజు ఆలస్యంగా సద్దుల బతుకమ్మ పండుగ చేస్తున్నారనే చర్చ మండలంలో వినిపిస్తోంది. పండుగ స్ఫూర్తిని దెబ్బతీసి ఇలా ఇష్టం వచ్చినట్లుగా తేదీలు మార్చడం అంతమంచిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు బతుకమ్మం ప్రతీక. అలాంటి పండుగను వ్యాపార నేపథ్యంలో తేదీలు మార్చడం తప్పని.. మరోసారి ఇలా జరగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చూడాలని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..: Mahishasura Mardini | మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన జగన్మాత