Home Guard Ex Gratia | హోంగార్డు కుటుంబానికి పరిహారం అందజేత

కామారెడ్డి జిల్లాకు చెందిన హోంగార్డు శ్రీనివాస్ గతేడాది విధి నిర్వహణలో మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Home Guard Ex Gratia | విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. కామారెడ్డి(Kamareddy) జిల్లాకు  చెందిన హోంగార్డ్ శ్రీనివాస్ గతేడాది మరణించారు.

Home Guard Ex Gratia | ఎస్పీ కార్యాలయంలో..

ఆయన కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను శ్రీనివాస్ భార్య రేఖ బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఈ మేరకు రేఖ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్​చంద్రను ( SP Rajesh Chandra) కలిశారు. ఎక్స్‌గ్రేషియా సాయం అందేలా చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో సేవలందించిన హోంగార్డుల కుటుంబాల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

మరణించిన హోంగార్డుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోలీసు శాఖ తరపున అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *