అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Health Sub Centres | తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, గ్రామీణ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకుఆరోగ్య భద్రత కల్పించడం, సమీపంలోనే వైద్యం అందించాలనే లక్ష్యంలో ఆరోగ్య శాఖకు రూ.740 కోట్లను విడుదల చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో, రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,569 కొత్త ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించనున్నారు. క్షేత్రస్థాయిలో వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం కానున్నాయి. దీంతో ప్రాథమిక వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రజలు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం పేర్కొంది.
Health Sub Centres | సకాలంలో చికిత్స
ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ద్వారా, పేద, మధ్యతరగతి కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల విడుదల గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్య సేవల లభ్యతను గణనీయంగా పెంచుతుందని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Mandula Samuel Warning | కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే