Revanth Reddy Warning | ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే వీపులు సున్నం చేస్తాం : సీఎం వార్నింగ్​

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వీపులు సున్నం చేస్తానని సీఎం హెచ్చరించారు. ఎవరు అడ్డు పడినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Warning | చెరువులు, కుంటలు ఆక్రమిస్తే తోలు తీస్తా.. ఎవరు అడ్డం పడినా, ఎండ్రిన్ తాగి సచ్చినా ఫ్యూచర్ సిటీ కడుతా అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. వన మహోత్సవం (Vana Mahotsavam)లో భాగంగా గుర్రంగూడ ఎకో పార్క్​లో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు.

సింగపూర్, హాంకాంగ్, టోక్యో, న్యూయార్క్‌లను చూసి గొప్ప నగరాలని ఎలా అనుకుంటున్నామో.. భవిష్యత్ తరాలు ఫ్యూచర్ సిటీని చూసి అలా అనుకునేలా తీర్చిదిద్దే బాధ్యత తనదని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనంతోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతుందన్నారు. ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్‌ (Hyderabad)కు రాకూడదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమం” చేపట్టిందని స్పష్టం చేశారు.

Revanth Reddy Warning | ప్రక్షాళన చేసి తీరుతాం

ఎవరేమనుకున్నా మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతానని రేవంత్​రెడ్డి అన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వ‌ర‌కు 55 కి.మీ అంత‌ర్జాతీయ స్థాయిలో మూసీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెరువులు, నాలాలు ఆక్ర‌మిస్తే తొడ్క‌లు తీస్తామని హెచ్చరించారు. గుర్రంగూడా ఎకో పార్క్‌కు ఎన్ని నిధులైనా ఇస్తామని ప్రకటించారు.

Revanth Reddy Warning | హైడ్రా తెచ్చాం

వనస్థలిపురంలో దేవుడి భూముల్ని కూడా కబ్జా చేశారని సీఎం పేర్కొన్నారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రా తెచ్చామని తెలిపారు. సొంత స్థలంలో ఇల్లు కడితే హైడ్రా రాదని చెప్పారు. అయితే చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు వంటి ప్రభుత్వ, ప్రకృతి వనరులను ఆక్రమించిన కబ్జాదారులపై మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Revanth Reddy Warning | అందుకే ఓడిపోయా

రాజకీయ కుట్రలో కొడంగల్‌లో ఓటమిపాలయ్యానని సీఎం తెలిపారు. ఆయన 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంట్​ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా ప్రజలు తనను నిలబెట్టారని చెప్పారు. పదేళ్లు ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గుర్రంగూడ ఎకో పార్కును కూడా కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు. పెద్ద లాయర్లను పెట్టి 424 ఎకరాల భూమిని కాపాడామన్నారు.

ఇది కూడా చదవండి : Food Safety Inspections | హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారుల తనిఖీలు.. నోటీసులు జారీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *