Telangana DSP Transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

Naresh Chandan
Telangana DSP Transfers

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana DSP Transfers : తెలంగాణ రాష్ట్రంలో పలు పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలు, ఏసీపీలను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తూ పోలీసు శాఖలో మార్పులు చేపట్టింది.

Telangana DSP Transfers : ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

ఈ ఉత్తర్వుల ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఏసీపీగా నర్సింగరావును నియమించారు. కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్‌, జగిత్యాల డీఎస్పీగా పురుషోత్తంరెడ్డిని నియమించారు. వికారాబాద్ జిల్లాకు ఏసీపీగా అంజయ్యను నియమించగా, మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఏసీపీగా రాజశేఖర్‌రెడ్డిని నియమించారు.

అలాగే ఆసిఫాబాద్ డీఎస్పీగా అశోక్‌, భద్రాచలం డీఎస్పీగా అరుణ్‌కుమార్‌ను నియమించారు. నిర్మల్ డీఎస్పీగా టీ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana DSP Transfers : గ్రేటర్​ హైదరాబాద్​లో..

ఇక నగర పోలీసు విభాగంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. చిక్కడపల్లి ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి, ఉప్పల్ ఏసీపీగా వెంకట్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీగా రాజా వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీగా శ్రీనివాస్‌, గోషామహల్ ఏసీపీగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమించారు.

ఇక మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీగా వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Kamareddy Murder Case | నాన్​వెజ్​ వండలేదని అడిగిన భర్తను చంపిన భార్య అరెస్ట్..

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *