Kamareddy Murder Case | నాన్​వెజ్​ వండలేదని అడిగిన భర్తను చంపిన భార్య అరెస్ట్..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Murder Case | నాన్​వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు(Kamareddy Police) అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ(Kamareddy) సీఐ నరహరి(CI Narahari) మీడియాకు వివరాలు వెల్లడించారు.

Kamareddy Murder Case | పట్టణంలోని గోసంగి కాలనీలో..

శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్​వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి: Indiramma Housing Progress | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *