Telangana Project Water Levels | ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటిమట్టాలు.. ఆనందంలో అన్నదాతలు

ఉమ్మడిజిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి/ఆర్మూర్​: Telangana Project Water Levels | ఉమ్మడిజిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు జీవకలను సంతరించుకుంటున్నాయి. ఆలస్యమైనప్పటికీ గత నాలుగైదురోజులుగా కురుస్తున్న వానలకు ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతోంది.

Telangana Project Water Levels | అన్నదాతల హర్షం..

భారీ వర్షాలతో అన్నదాతలు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బోరుబావుల కింద పలుచోట్ల నాట్లు పడ్డాయి. నీటిజాడ కోసం ఎదురుచూస్తున్న రైతులకు నాలుగైదురోజులుగా కురుస్తున్న వానలు సంతృప్తినిస్తున్నాయి. దీంతో వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Telangana Project Water Levels | నిజాంసాగర్​లోకి స్వల్ప ఇన్​ఫ్లో

నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project)లో ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,935 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 7.466 టీఎంసీల నీరు ఉంది.  కళ్యాణి ప్రాజెక్టు ఎగవ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వస్తుంది. ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కులు వరద నీరు వస్తోంది. ఫ్లడ్​గేట్ల ద్వారా 100 క్యూసెక్కులు నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు డైవర్షన్ నీటిని నిలిపివేశారు. ప్రాజెక్టు వరద ఉధృతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పైనుంచి వచ్చే వరద నీటిని యధావిధిగా కిందికి విడుదల చేస్తున్నారు.

Telangana Project Water Levels | పోచారం ప్రాజెక్టులోకి..

పోచారం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1464.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1454.50 అడుగుల వద్ద నీరు ఉంది. అయితే. నీటి నిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.589 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 4,156 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

Telangana Project Water Levels | శ్రీరామ్​సాగర్​కు పెరుగుతున్న వరద..

రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఇన్​ఫ్లో రూపంలో 9,240 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు 80.5 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,065 అడుగులు 17.103 టీఎంసీల నీటి నిలువ ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ వరద నీరు చేరడంతో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్నారు. కాగా కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Jeevan Reddy Janata Garage | ఆర్మూర్‌లో జీవన్​ రెడ్డి జనతా గ్యారేజ్ హంగామా..రీల్ రిపేర్లు ఎంత? రియల్ రాజకీయం ఎంత?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *