అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Airstrikes Iran | ఇరాన్‌లో అమెరికా తాజాగా దాడులు నిర్వహించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. చమురు శుద్ధికి కీలక కేంద్రమైన ఇరాన్‌లోని అబాదాన్ తో పాటు పలు చోట్ల అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
జోర్డాన్‌లోని ఒక అమెరికన్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన క్షిపణి దాడికి ప్రతీకారంగా, అమెరికా సైన్యం ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించింది. చర్చలను పునఃప్రారంభించేందుకు వీలుగా గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాంబు దాడులను నిలిపివేసిన తర్వాత ఇరాన్‌పై అమెరికా జరిపిన మొదటి దాడులు ఇవే కావడం గమనార్హం. అమెరికా బలగాలపై ఇరాన్ జరిపిన దాడి ప్రయత్నాలకు ఈ దాడులు శక్తివంతమైన ప్రతిస్పందన అని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
US Airstrikes Iran | ట్రంప్ హెచ్చరిక తర్వాత..
ఇరాన్‌పై గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. మేము వాళ్లను గట్టిగా దెబ్బకొడతాం అని ఆయన పేర్కొన్నారు. అనంతరం యూఎస్ ఆర్మీ దాడులు చేసింది. జోర్డాన్‌లోని అమెరికా ఆస్తులపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) సైనిక చర్యలు చేపట్టింది. ఒక వైమానిక స్థావరం, అలాగే ఒక కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం, టెహ్రాన్ నుంచి ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ పేర్కొంది.
ఇది కూడా చదవండి..: India Condemns Ship Attacks | నౌకలపై దాడులను ఖండించిన భారత్