అక్షరటుడే, డిచ్‌పల్లి: Ghanpur Dichpally Road Closure | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో (South Central Railway) చేపడుతున్న డబ్లింగ్ పనుల్లో భాగంగా డిచ్‌పల్లి (Dichpally) మండలం ఘన్‌పూర్ సమీపంలోని ఎల్‌సీ గేట్ నంబర్ 196ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీఎస్‌ఎల్‌ఎస్‌వీ ప్రసాద్ గురువారం ప్రకటన విడుదల చేశారు.
Ghanpur Dichpally Road Closure | రెండు రోజుల పాటు
ఎల్‌సీ గేట్ నంబర్ 196 (కిలోమీటర్ 473/700-800) వద్ద గేట్ లాడ్జి తరలింపు, డబుల్ లైన్ ఏర్పాటుతో పాటు ట్రాక్ లింకింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 22 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 24 ఉదయం 8 గంటల వరకు గేట్‌ను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో ఘన్‌పూర్ నుంచి డిచ్‌పల్లి స్టేషన్ రోడ్డు వైపు ఎల్‌సీ గేట్ మీదుగా రహదారి రాకపోకలకు అనుమతి ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా ముద్‌ఖేడ్–మేడ్చల్ మార్గంలో వంతెనలు, ఆర్‌యూబీలు, విద్యుదీకరణ, సిగ్నలింగ్ తదితర పనులు కొనసాగుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ తెలుగు 10లో డే 9.. కెప్టెన్సీ టాస్క్‌తో హౌస్‌లో మరోసారి హీట్ పెరిగిపోయింది!