అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Maruti Ganesh Laddu Auction | నిజామాబాద్ NIZAMABAD జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతమైన పెద్ద బజార్లో గల మారుతీ గణేష్ మండలి వద్ద వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ గణేష్ లడ్డూ వేలం పాట అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. గణపయ్య దివ్య ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడటంతో వేలం పాట ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది.
Maruti Ganesh Laddu Auction | హోరాహోరీగా సాగిన ఈ వేలం
కేవలం రూ. 1,000తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం పాటలో సుమారు 20 మంది భక్తులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు హోరాహోరీగా సాగిన ఈ వేలంలో పెద్ద బజార్ ప్రాంతానికి చెందిన మాదాని గంగాధర్ అత్యధికంగా ₹53,000/- (ఏభై మూడు వేల రూపాయలు) పలికి స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
ALSO READ : Youtuber Home Robbery | యూట్యూబ్‌లో డబ్బుల వీడియో.. సీన్ కట్ చేస్తే రూ.1 కోటి, కిలో బంగారం మాయం!
ఉత్కంఠభరితంగా సాగిన ఈ పాట ముగిసిన అనంతరం, మారుతీ గణేష్ మండలి నిర్వాహకులు శాలువా మరియు పూలమాలలతో మాదాని గంగాధర్‌ను సత్కరించి శ్రీ విఘ్నేశ్వరుని దివ్య ప్రసాదాన్ని అందజేశారు.
Maruti Ganesh Laddu Auction | పూర్వజన్మ సుకృతం
ఈ సందర్భంగా మాదాని గంగాధర్ మాట్లాడుతూ.. శ్రీ మారుతీ గణపతి దివ్య లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, స్వామివారి కృపతో నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండలి నిర్వాహకులకు, నగర భక్తజనానికి వినాయక చవితి, నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.