Rusty Spotted Cat | రోడ్డు ప్రమాదంలో అరుదైన పిల్లిజాతి జంతువు మృతి

అడవుల్లో అరుదుగా కనిపించే పిల్లిజాతి జంతువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Rusty Spotted Cat | అడవుల్లో అరుదుగా కనిపించే పిల్లిజాతి జంతువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని (Nizamabad) సిరికొండ రేంజ్​ పరిధిలోని హుస్సేన్​ నగర్​ బీట్​ కంపార్ట్​మెంట్​ వద్ద చోటు చేసుకుంది.

Rusty Spotted Cat | ఆర్మూర్​ డివిజన్​ పరిధిలో..

అటవీశాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆర్మూర్​ అటవీ డివిజన్ పరిధిలోని, సిరికొండ రేంజ్​లో హుస్సేన్ నగర్ బీట్ కంపార్ట్​మెంట్​ నం.408లో రోడ్డు ప్రక్కన బొడ్డు మామిడి చెరువు ప్రాంతంలో ఒక పిల్లి జాతి జంతువు మృతి చెందినదని సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అది రస్టీ స్పాటెడ్ క్యాట్ (Rusty spotted cat) తుప్పు రంగు మచ్చల పిల్లి అని నిర్ధారించారు. ఈ జంతువు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూలు-1కు చెందినదని.. చాలా అరుదైనదిగా వారు గుర్తించారు. సిరికొండ అటవీ క్షేత్రాధికారి దీనిని అడవి జంతువు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. అటవీప్రాంతంలో వాహనాలు నడిపే సమయంలో గంటకు 30 కిమీలకు మించని వేగంతో ప్రయాణించాలని కోరారు.

ఇది కూడా చదవండి: తమ్ముడికి చివరిసారిగా రాఖీ కట్టి కన్నీటి వీడ్కోలు 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *