Nagendra Resignation | అవినీతి ఆరోపణలు.. ఏడుస్తూ రాజీనామా చేసిన మంత్రి నాగేంద్ర

కర్ణాటక మంత్రి నాగేంద్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagendra Resignation | కర్ణాటక (Karnataka) మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వాల్మికీ కార్పొరేషన్​లో నాగేంద్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన రాజీనామా చేయాలని బీజీపీ నాయకులు కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన పదవిని వీడారు. రాజీనామాను ప్రకటించేటప్పుడు ఆయన భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆగస్టు మొదటి వారంలో నాగేంద్ర తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు.

Nagendra Resignation | రూ.89 కోట్ల అక్రమాలు

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో రూ.89 కోట్ల మేర అక్రమాలు జరిగాయని బీజేపీ (BJP) కొంతకాలంగా ఆరోపిస్తోంది. 2024 మే నెలలో ఆ సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ పి. ఆత్మహత్య చేసుకోవడం, ఆ సమయంలో నిధుల అనధికార బదిలీ గురించి ప్రస్తావిస్తూ రాసిన లేఖ బయటపడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన విచారణలో, సంస్థ బ్యాంక్ ఖాతాల నుండి భారీ మొత్తంలో నిధులు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తేలింది.

Nagendra Resignation | రెండోసారి రాజీనామా

డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి కాకముందు సిద్ధరామయ్య మంత్రివర్గంలో నాగేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు కుంభకోణం వెలుగులోకి రావడంతో 2024 జూన్‌లో రాజీనామా చేశారు. అనంతరం డీకే శివకుమార్​ సీఎం అయ్యాక ఆయన తిరిగి మంత్రిగా ఎంపికయ్యారు. శివకుమార్​కు ఆయన సన్నిహితుడిగా పేరుంది. తాను స్వయంగా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు.

దీనిని కూడా చదవండి : CBI Bribery Case | రూ.40 లక్షల లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన జీఎస్​టీ అధికారులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *