Kolkata Hotel Fire | కోల్​కతాలో అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

కోల్‌కతాలోని ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kolkata Hotel Fire | కోల్‌కతా (Kolkata)లోని ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా కనీసం తొమ్మిది మంది మరణించారు.

నగరంలోని అత్యంత రద్దీగా ఉండే న్యూ మార్కెట్ సమీపంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్‌లో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో పలువురు అతిథులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదంలో మరణించిన వారిలో బంగ్లాదేశ్ జాతీయులు కూడా ఉన్నారు.

Kolkata Hotel Fire | కేసు నమోదు

హోటల్‌లో కనీస అగ్నిమాపక భద్రతా చర్యలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం పరారీలో ఉన్న హోటల్ యజమాని, సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల సమయంలో భవనం నుంచి సుమారు 60 మందిని రక్షించగా, ఒక మైనర్‌తో సహా తొమ్మిది మంది అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Kolkata Hotel Fire | ఏసీ పేలుడంతో..

హోటల్‌లోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో, హోటల్ గదులన్నీ పొగతో నిండిపోయాయి. నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశాయి. కాగా బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని ఒక హోటల్‌లో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఎనిమిది మంది మరణించారు.

ఇది కూడా చదవండి..: Bank Fraud Case | బ్యాంక్​ మోసం కేసులో ముగ్గురికి జైలు శిక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *