Vijay MLA Benefits | ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం

ఎమ్మెల్యేలకు కారు, ఇంధన భత్యం, మెరుగైన ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay MLA Benefits | తమిళనాడు సీఎం విజయ్​ (Tamil Nadu CM Vijay) ఎమ్మెల్యేలకు వరాలు ఇచ్చారు. కారు, ఇంధన భత్యం, మెరుగైన ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ఒక కారుతో పాటు ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం భత్యం ఇస్తామన్నారు.

తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులను నిర్వహించుకోవడంలో సహాయపడేందుకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాన్ని సమకూరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీలో మొదటిసారి ఎన్నికైన వారు, సాధారణ నేపథ్యాల నుండి వచ్చిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వారికి కారు అవసరమని విజయ్ తెలిపారు.

Vijay MLA Benefits | నెలకు రూ.75 వేలు

డ్రైవర్, ఇంధనం, కార్ల నిర్వహణ ఖర్చుల కోసం ఎమ్మెల్యేలకు నెలకు రూ. 75,000 భత్యాన్ని కూడా విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక పనుల కోసం కార్యదర్శిని (సెక్రటరీ) నియమించుకోవడానికి రూ. 25,000 గ్రాంట్ కూడా లభిస్తుంది. ప్రజా ప్రతినిధులకు వర్తించే ఆరోగ్య బీమా పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొంది. విజయ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష DMK తీవ్రంగా విమర్శించింది, ఇది అనవసరమైన ఖర్చు అని పేర్కొంది. దీంతో రాష్ట్రంపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి..: Kolkata Hotel Fire | కోల్​కతాలో అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *