MP Pappu Yadav | ఎంపీ పప్పు యాదవ్​పై దాడికి యత్నం.. ఇద్దరి అరెస్ట్

ఎంపీ పప్పు యాదవ్​పై దుండగులు దాడికి యత్నించారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Pappu Yadav | బీహార్​లోని పూర్ణియ ఎంపీ పప్పు యాదవ్​పై కొందరు దాడికి యత్నించారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పప్పు యాదవ్​ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఢిల్లీలోని తన నివాసంలో ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తుండగా కత్తితో దుండగుడు దాడికి యత్నించాడు. అతడిని వెంటనే ఎంపీ అనుచరులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అతడితో పాటు మరో వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. పప్పు యాదవ్​ శనివారం పార్లమెంట్ ప్రాంగణంలో రామమందిర విరాళాల చోరీపై ఒక స్కిట్ ప్రదర్శించిన విషయం తెలిసిందే.

MP Pappu Yadav | నన్ను చంపే కుట్ర

దుండగులు పప్పు యాదవ్​ కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే కత్తితో దాడి చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిని ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన సుమిత్‌గా గుర్తించారు. ఈ దాడి అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. తనను చంపడానికి కుట్ర జరిగిందని ఆరోపించారు. అంతకుముందు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో గందరగోళం నెలకొంది. ఒక అజ్ఞాత వ్యక్తి ఎంపీపై బూటు విసరడంతో తోపులాట చోటుచేసుకుంది. తన పిల్లలు ఉన్న ఇంటిపై సైతం దాడికి యత్నించారని పప్పు యాదవ్​ పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడనని చెప్పారు.

దీనిని కూడా చదవండి : Kanwar Yatra | కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన పికప్ వాహనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *