అక్షరటుడే, వెబ్డెస్క్ : Indonesia Ferry Fire | ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో వెళ్తున్న ప్రయాణికుల నౌకలో మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో 41 మంది గల్లంతు అయ్యారు.
సముద్రంలో ప్రయాణిస్తున్న ఇండోనేషియా ఫెర్రీలో కనీసం 250 మంది ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 41 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మదురా ద్వీపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాసర్‌కు ఈ నౌక ప్రయాణిస్తుండగా, మదురా ద్వీపం సమీపంలో మంటలు చెలరేగినట్లు నౌక కెప్టెన్ తెలిపారు.
Indonesia Ferry Fire | పలువురిని రక్షించిన అధికారులు
పడవలో మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురి అయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలో దూకారు. లైఫ్ జాకెట్లు వేసుకొని నీళ్లలో దూకారు. సమాచారం అందుకున్న అధికారులు పలువురు ప్రయాణికులను కాపాడారు. 41 మంది గల్లంతు కాగా.. ఐదుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఫెర్రీకి మంటలు ఎలా అంటుకున్నాయో తెలియదని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అని, తరలింపు ప్రక్రియను వేగంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి సంబంధిత ఏజెన్సీలన్నింటితో సమన్వయం చేసుకుంటున్నామని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
BREAKING: At least five people have died and 41 remain missing after the passenger ship KM Mutiara Sentosa 2 caught fire this morning off Madura Island in the Java Sea, near Sumenep Regency, Indonesia.
Inaccurate passenger manifests continue to hamper search and rescue efforts. pic.twitter.com/qqSgMYlh5B
— Weather Monitor (@WeatherMonitors) August 2, 2026
దీనిని కూడా చదవండి : Kids Water Intake | చల్లగా ఉందని పిల్లలు నీళ్లు తక్కువ తాగుతున్నారా? నిపుణుల కీలక హెచ్చరిక