Pakistan Bomb Blast | పాకిస్థాన్​లో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి

పాకిస్థాన్​లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Bomb Blast | పాకిస్థాన్​లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో పాక్​ పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని జరిగిన పేలుడులో ఏడుగురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు.

స్వాత్ జిల్లాలోని ఒక పట్టణంలో ‘శాంతి ర్యాలీ’ జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. గత కొన్ని నెలలుగా భద్రతా పరిస్థితి క్షీణించిన ఈ ప్రాంతంలో శాంతిని కోరుతూ, స్థానిక గిరిజన మండలి అయిన స్వాత్ అమన్ జిర్గా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్నవారు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో పేలుడు చోటు చేసుకుంది. దీనిని ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రులకు తరలించారు.

Pakistan Bomb Blast | భయంతో పరుగులు

ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకోవడంతో వారు భయంతో పరుగులు తీశారు. పోలీసులు, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దాడి ఎవరు చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా దాడికి బాధ్యత వహించలేదు.

దీనిని కూడా చదవండి : MP Pappu Yadav | ఎంపీ పప్పు యాదవ్​పై దాడికి యత్నం.. ఇద్దరి అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *