అక్షరటుడే, వెబ్‌డెస్క్: Us Iran War | అమెరికా, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు దాడులతో విరుచుకుపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణను ముగించడానికి ఒక ఒప్పందం రూపుదిద్దుకుంటోందని, ప్రాంతీయ మిత్రదేశాలతో కూడిన విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ప్రస్తుతానికి కొత్త అమెరికా దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
Us Iran War | ఇజ్రాయెల్ అంగీకారం..
ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో.. ప్రతిపాదిత ఒప్పందంలో “హర్మూజ్ జలసంధిని తక్షణమే, పూర్తిగా తెరవడం” మరియు ఇరాన్ అణు ముప్పునకు ముగింపు పలకడం వంటివి ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని సాధించడంలో అమెరికాతో కలిసి పనిచేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని తెలిపారు.
Us Iran War | దాడులకు బ్రేక్..!
ఒప్పందం దిశగా అర్థవంతమైన పురోగతి సాధిస్తే, ప్రణాళికాబద్ధమైన సైనిక దాడిని రద్దు చేయడానికి తాను అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. “ఈ అభ్యర్థన ఆధారంగా, ప్రపంచ భవిష్యత్ ప్రయోజనం కోసం మరియు అదేవిధంగా, విజయవంతమైన, సంపన్నమైన ఇరాన్ మనుగడ కోసం, వేగంగా ఒక ఒప్పందం కుదుర్చుకోగలిగే షరతుకు లోబడి, దాడిని రద్దు చేయడానికి నేను అంగీకరించాను” అని ట్రంప్ రాసుకొచ్చారు. ఐదు నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణకు ముగింపు పలికే లక్ష్యంతో కుదిరే ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రయత్నాలలో ఇజ్రాయెల్ కూడా అమెరికాతో చేతులు కలుపుతుందని పేర్కొన్నారు.
🚨BREAKING: Iran says they have agreed to end their nuclear program and leaving the Strait of Hormuz alone.
Trump responds: The U.S. is “locked and loaded at levels not seen since WWII, but will hold off the attack if the deal is rapidly finalized!”
“The U.S.A. is locked and… pic.twitter.com/yqlkBs8Lj6
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) August 2, 2026
ఇది కూడా చదవండి.: US Airstrikes Iran | ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు